ఆరోగ్యం
తమ తాగునీరు సురక్షితమేనన్న బిస్లెరీ
బిస్లెరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించిన మరుసటి రోజు, తమ ప్యాకేజ్డ్ తాగునీరు సురక్షితమేనని ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. రిఫరల్ ల్యాబ్ పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి నిర్దేశిత పరిమితిలోనే ఉందని తెలిపింది. ఆహార నియంత్రణ సంస్థకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది.