విద్య
జేఎన్టీయూఏలో ఏఐ ఆధారిత మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్
అనంతపురం జేఎన్టీయూఏ ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఏఐ-డ్రివెన్ మెకానికల్ ఇంజినీరింగ్’ అంశంపై ఐదు రోజుల వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. నవంబర్ 23 నుంచి 27 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలు పెంచుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్ విద్యార్థులకు సూచించారు.